మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర PAC సభ్యులు, కొండపి నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి డాక్టర్ ఆదిమూలపు సురేష్ గారి తనయుడు, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువ నాయకుడు, రాష్ట్ర ఐటీ విభాగం జనరల్ సెక్రటరీ ఆదిమూలపు విశాల్ జన్మదిన వేడుకలను సింగరాయకొండ మండల వైఎస్సార్‌సీపీ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి కేక్ కట్ చేసి విశాల్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఆయన రాజకీయ, సామాజిక రంగాల్లో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *