• ప్రజాస్వామ్యంలో అందరికీ పోటీ చేసే హక్కు ఉంది
  • కొడవలూరు ఎంపీడీవో కార్యాలయంలో నార్త్‌ రాజుపాళెం రెండు ఎంపీటీసీ స్థానాలకు నామినేషన్లు
  • నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు
  • కూటమి అభ్యర్థులు ఎన్నికల నిబంధనలు పాటిస్తూ ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు జరిగేలా చూడాలి
  • ఇంటింటికీ వెళ్లి రెండున్నరేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని ప్రజలకు వివరించండి

గత వైసీపీ ప్రభుత్వ హయాంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారని కోవూరు శాసనసభ్యులు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారు విమర్శించారు.ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికీ ఎన్నికల్లో పోటీ చేసే హక్కు ఉందని, గతంలో ప్రతిపక్ష అభ్యర్థులకు ఆ అవకాశం లేకుండా చేసినవారు ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్నారని ఆరోపించారు. బుధవారం కొడవలూరు మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో జరిగిన నామినేషన్ల కార్యక్రమంలో ఎమ్మెల్యే గారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నార్త్‌ రాజుపాళెం–1 ఎంపీటీసీ స్థానానికి పోసింరెడ్డి మధురిమ, నార్త్‌ రాజుపాళెం–2 స్థానానికి పల్లా వెంకటేశ్వర్లు నామినేషన్లు దాఖలు చేశారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *