తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :-
బుచ్చిరెడ్డిపాళెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో కోవూరు ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి సమక్షంలో సీపీఎంకు చెందిన కీలక నాయకుడు ప్రసాద్, ఆయన అనుచరులు 15 మందికి పైగా తెలుగుదేశం పార్టీలో చేరారు.బుచ్చిరెడ్డిపాళెం రూరల్ టీడీపీ అధ్యక్షుడు శ్రీ బెజవాడ జగదీశ్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ చేరికల కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు వారికి పసుపు కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.ఈ సందర్భంగా బుచ్చిరెడ్డిపాళెం మున్సిపాలిటీ అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం కూటమి అభ్యర్థుల విజయానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి గారు పిలుపునిచ్చారు.