ఈనెల జూన్ 8వ తేదీ సోమవారం మార్కాపురం జిల్లా యర్రగొండపాలెం సర్కిల్ పోలీస్ స్టేషన్ లో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (PGRS) కార్యక్రమం జరగనుంది. కార్యక్రమానికి జిల్లా ఇన్ ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు హాజరై ప్రజల నుంచి అర్జీలు స్వీకరిస్తారని డిఎస్పి నాగరాజు ఆదివారం తెలిపారు. ఈ కార్యక్రమాన్ని గిద్దలూరు పరిసర ప్రాంతాల ప్రజలతో పాటు మార్కాపురం జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఈ కార్యక్రమం జరుగుతున్నట్లు డి.ఎస్.పి నాగరాజు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *