కందుకూరు పట్టణంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో ఉన్న ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ప్రకాశం జిల్లా ఐవీఎఫ్ (IVF) టీం ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్, మాజీ ఎమ్మెల్యే మరియు ప్రముఖ సినీ నిర్మాత అంబికా కృష్ణ, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ, నూతనంగా బాధ్యతలు స్వీకరిస్తున్న ఐవీఎఫ్ కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. కందుకూరులో తన విజయంలో ఆర్యవైశ్యుల పాత్ర ఎంతో కీలకమైందని, వారికి ఎలాంటి సమస్య వచ్చినా తాను అండగా నిలుస్తానని హామీ ఇచ్చారు.గత ప్రభుత్వ హయాంలో వ్యాపారులను ‘జే ట్యాక్స్’ పేరుతో ఇబ్బందులకు గురిచేశారని, అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపారులకు అనుకూల వాతావరణం కల్పిస్తూ పరిపాలన సాగుతోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ విజయానికి ఆర్యవైశ్యులు విశేషంగా కృషి చేశారని అన్నారు.అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే, పొట్టి శ్రీరాములు స్మృతివనం పేరుతో 56 అడుగుల కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు.ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ డూండీ రాకేష్ గతంలో అనేక ఇబ్బందులు, కేసులను ఎదుర్కొన్నప్పటికీ పార్టీ పట్ల నిబద్ధతతో పనిచేశారని ఎమ్మెల్యే ప్రశంసించారు. నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆర్యవైశ్య సమాజానికి ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తాను ముందుండి సహకరిస్తానని తెలిపారు.ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ రాకేష్ మాట్లాడుతూ కందుకూరు నియోజకవర్గంలో ఆర్యవైశ్యులకు అండగా నిలుస్తున్న శాసనసభ్యులు నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు తెలిపారు.. గత ప్రభుత్వంలో ఆర్యవైశ్యులపై దాడులు జరుగుతున్నాయి అని ప్రశ్నిస్తే కేసులతో తమ గొంతులు నొక్కేసారని కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రజలందరూ సంతోషంగా జీవిస్తున్నారని తెలిపారుఈ కార్యక్రమంలో ఆర్యవైశ్య నాయకులు కూన శ్రీనివాసరావు, పల్లపోతు వెంకటేశ్వర్లు, జలదంకి కృష్ణారావు, బొగ్గవరపు సుబ్బారావు నియోజకవర్గంలో ఆర్యవైశ్య ముఖ్య నాయకులు. మహిళలు, యువకులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *