ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎన్‌డీఓ ఏపీ రంగనాయకులు, మండల అభివృద్ధి అధికారి ఎన్. మధుసూదన్ రెడ్డి, ఆయుష్ డాక్టర్, ఏపీడీ గురువర కుమార్, పీడీ రమణ రెడ్డి తదితరులు హాజరై కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, యోగా ప్రతి ఒక్కరి జీవితంలో ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మరియు శారీరక దృఢత్వాన్ని పెంపొందించేందుకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.
రాబోయే 2026 యోగాంధ్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
అలాగే యోగా గురువులు చెక్కా కృష్ణ , మాధవ కృష్ణారావు యోగా సాధన ప్రాముఖ్యతను వివరించి, పలువురు విద్యార్థులు మరియు ప్రజలకు ప్రదర్శనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో అధికారులు, యోగా గురువులు, శిక్షణార్థులు మరియు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా ముగిసింది.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *