ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో, ఒంగోలు సబ్‌డివిజన్ సిబ్బందితో కలిసి ఎన్‌జీ పాడు–చిన్నగంజాం మండల సరిహద్దు ప్రాంతంలో జూదం నిర్వహిస్తున్న వారిపై సంయుక్తంగా భారీ దాడి నిర్వహించారు. నిఘా సమాచారం మేరకు చేపట్టిన ఈ ప్రత్యేక ఆపరేషన్‌లో జూదం ఆడుతున్న 11 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు.ఈ దాడిలో వారి వద్ద నుంచి రూ.1,03,580 నగదు, 11 మొబైల్ ఫోన్లు, 6 మోటార్ సైకిళ్లు స్వాధీనం చేసుకున్నారు. జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు సమాజంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించడమే కాకుండా, కుటుంబాలను ఆర్థికంగా దెబ్బతీసి ఇతర నేరాలకు దారితీసే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు.ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం కఠిన చర్యలు కొనసాగిస్తారని, ప్రజలు తమ పరిసరాల్లో జరుగుతున్న జూదం, గంజాయి, ఇతర చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *