ప్రజా ఫిర్యాదులను తక్షణ పరిష్కారం అందించాలనే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్., గారి ఆదేశాల మేరకు మహిళా పోలీస్ స్టేషన్ డిఎస్పీ పి.శ్రీధర్ మరియు పోలీస్ అధికారులు సోమవారం ఒంగోలు, జిల్లా పోలీస్ కార్యాలయంలో “మీకోసం”(PGRS) కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ సమస్యలకు సంబంధించిన వ్రాతపూర్వక అర్జీలను పోలీస్ అధికారులకు సమర్పించారు. వారు తమ సమస్యలను వివరంగా తెలియజేశారు. పోలీస్ అధికారులు ఫిర్యాదుదారులతో ముఖాముఖీగా మాట్లాడి, వాటిని త్వరితగతిన పరిష్కారిస్తామని భరోసా కల్పించారు. అలాగే అందిన ఫిర్యాదులను సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులకు పంపించి, చట్టం ప్రకారం వేగంగా విచారణ జరిపి బాధితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. అలాగే జిల్లా పోలీస్ కార్యాలయానికి రాలేని ప్రజలు తమ ఫిర్యాదులను సమీపంలోని పోలీస్ స్టేషన్లు, సర్కిల్ కార్యాలయాలు, సబ్-డివిజన్ కార్యాలయాల్లో కూడా అందజేయవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా సివిల్, భూ, ఆర్థిక తగాదాలు, చీటింగ్, అత్తరింటి వేదింపులు తదితర అంశాలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో కందుకూరు సీఐ షైక్ అన్వర్ భాషా,సింగరాయకొండ సీఐ శ్రీహరి,అద్దంకి అర్బన్ సీఐ సుబ్బరాజు,ప్యానెల్ అడ్వొకేట్ బి.బాలాజీ సింగ్, సమస్యల పరిష్కార వేదిక ఎస్సై జనార్దన్ రావు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *