మహిళలు, చిన్నారుల భద్రతను మరింత బలోపేతం చేయడం, అత్యవసర పరిస్థితుల్లో తక్షణ పోలీస్ సహాయం అందుబాటులో ఉండేలా చేయడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు మరియు మార్కాపురం జిల్లా పోలీసులు శక్తి యాప్ (Sakthi App) వినియోగంపై జిల్లావ్యాప్తంగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. పాఠశాలలు, కళాశాలలు, గ్రామాలు, మహిళా సంఘాలు మరియు వివిధ సామాజిక వర్గాల మధ్య ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ మహిళలు, బాలికల్లో భద్రతా చైతన్యం పెంపొందిస్తున్నారు.ఈ సందర్భంగా పోలీస్ అధికారులు మహిళలకు శక్తి యాప్ డౌన్‌లోడ్, వినియోగ విధానం గురించి వివరించి, అత్యవసర పరిస్థితుల్లో ఒక క్లిక్‌తో పోలీసుల సహాయం ఎలా పొందవచ్చో ప్రదర్శన ద్వారా తెలియజేస్తున్నారు. మహిళలపై వేధింపులు, ఈవ్‌టీజింగ్, అనుమానాస్పద కదలికలు లేదా ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు ఈ యాప్ వేగవంతమైన సహాయానికి ఎంతగానో ఉపయోగపడుతుందని వివరించారు.అదేవిధంగా చిన్నారుల భద్రతపై కూడా అవగాహన కల్పిస్తూ తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు మరియు సమాజం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మహిళలు, బాలికలు ఎలాంటి సమస్యలు ఎదురైనా భయపడకుండా ముందుకు వచ్చి పోలీసులను సంప్రదించాలని, వారి భద్రత కోసం పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.సురక్షిత సమాజ నిర్మాణంలో మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ, టెక్నాలజీ ఆధారిత భద్రతా వ్యవస్థలను ప్రజలకు చేరువ చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *