కందుకూరు – టీడీపీ కార్యాలయంలో 32 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే నాగేశ్వరరావు, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను గురువారం పంపిణీ చేశారు. కందుకూరు అర్బన్ పరిధిలో 16 మందికి 15,35,451 రూపాయలు మరియు రూరల్ మండలం పరిధిలో 16 మందికి 7,84,993 రూపాయల విలువైన చెక్కులను అందజేశారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రాజకీయాలకు అతీతంగా దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి సాయం అందిస్తున్నట్లు చెప్పారు.కందుకూరు నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు 1313 మందికి 10.42 కోట్ల రూపాయల సహాయాలు అందించటం చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే ఇంటూరి పేర్కొన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ఆపరేషన్ల కోసం కేవలం 24 గంటల్లోనే LOC లెటర్లు అందిస్తున్నట్లు చెప్పారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *