సామాజిక స్పృహ, సేవా గుణం కల వారిని గుర్తించడంలో లయన్స్ క్లబ్ ముందుంటుంది అని కంభం లయన్స్ క్లబ్ సర్వీస్ చైర్ పర్సన్, మాజీ జడ్పీటీసీ సయ్యద్ జాకీర్ హుస్సేన్ పేర్కొన్నారు…స్థానిక ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలో కొందరు వ్యాపారులు వారి దుకాణాల ఆవరణలో స్వచ్చందంగా ముందుకు వచ్చి వేసవి కాలంలో ప్రజల దాహార్తి తీర్చే సదుద్దేశంతో చల్లని మంచి నీటి క్యాన్ లను ఏర్పాటు చేసి తమ సామాజిక స్పృహను చాటారు…ఈ నేపథ్యంలో పెయింట్ దుకాణం నిర్వహించే పోలిశెట్టి రమణ, మదన్ మోహన్ సోదరులు, చెప్పుల దుకాణం నిర్వహించే షేక్ నదీమ్ లను గుర్తించి, వారి సేవాగుణాన్ని ప్రోత్సహంచేటందుకు కంభం లయన్స్ క్లబ్ అధ్యక్షుడు లయన్ బాల రంగారావు ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు వారిని శాలువాలతో సత్కరించి అభినందించడం జరిగింది. ఇలాంటి వారికి లయన్స్ క్లబ్ లు ఆదరిస్తాయని క్లబ్ సభ్యులు పేర్కొన్నారు…ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు కంభం లాయర్ మహబూబ్ బేగ్, వెంకట రావు, మండల కో ఆప్షన్ సభ్యుడు సయ్యద్ సలీమ్, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *