తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ప్రకాశం జిల్లా ఎస్పీ ఆదేశాలు, కందుకూరు డీఎస్పీ సూచనల మేరకు కందుకూరు సర్కిల్ సీఐ ఆధ్వర్యంలో పట్టణంలోని పోతురాజు మిట్ట, బండపాలెం ప్రాంతాల్లో గంజాయి సంబంధిత అనుమానిత ప్రదేశాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో కందుకూరు పట్టణ, రూరల్ ఎస్ఐలు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గంజాయి విక్రయం, రవాణా, వినియోగంపై నిఘా చేపట్టారు. అనంతరం స్థానిక ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించి, గంజాయి వల్ల కలిగే నష్టాలపై వివరించారు.ఈ సందర్భంగా కందుకూరు సీఐ మాట్లాడుతూ, ఎక్కడైనా గంజాయి అమ్మకం, రవాణా లేదా వినియోగం జరుగుతున్నట్లు తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచడంతో పాటు తగిన బహుమతి కూడా అందజేస్తామని తెలిపారు.కందుకూరు పట్టణాన్ని గంజాయి రహిత ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రజల సహకారం అవస