గుడ్లూరు మండలం చేవూరు దగ్గర ఏర్పాటైన ఇండోసోల్ పరిశ్రమలో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదంటూ ప్రజలు ఆందోళన చేపట్టారు. చేవూరు, రావూరు, ఏలూరుపాడు గ్రామాల ప్రజలు పాల్గొని… చేవూరు నుంచి హైవే రోడ్డుపై రాకపోకలను అడ్డుకున్నారు. భూములు ఇచ్చిన తమను పక్కనపెట్టి, ఇతర రాష్ట్రాల వారికి ఉద్యోగాలు ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులకే ఎక్కువ ఉద్యోగాలు ఇస్తామని గతంలో కంపెనీ వాళ్ళు చెప్పిన మాటను ఈ సందర్భంగా గుర్తు చేశారు. అలాగే తమ గ్రామాల పరిధిలోని కుంటలు, వాగులలో ఉపాధి పనులు చెయ్యనీయకుండా కంపెనీవారు అడ్డుపడుతున్నారని అన్నారు. అలాగే చేవూరు నుంచి హైవే వరకు రోడ్డు నిర్మాణం మధ్యలో వదిలేశారని, పైకితేలిన కంకరతో చాలా నెలలుగా ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. పోలీసులు వచ్చి, ప్రజలతో మాట్లాడారు. కంపెనీ ప్రతినిధులను కూడా పిలిపించి చర్చలు జరిపారు. రోడ్డు పనులు త్వరగా పూర్తి చేస్తామని కంపెనీ ప్రతినిధుల హామీ ఇచ్చారు. అలాగే స్థానికులకే ఉపాధి కల్పిస్తామని చెప్పడంతో ప్రజలు ఆందోళన విరమించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *