రోడ్డు ప్రమాదాల నివారణ, ద్విచక్ర వాహనదారుల ప్రాణ రక్షణ మరియు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు టంగుటూరు టోల్ ప్లాజాలోని SEL సిబ్బందికి ప్రత్యేక హెల్మెట్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.టంగుటూరు ఎస్సై ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోడ్డు భద్రతా నియమాల ప్రాముఖ్యత, హెల్మెట్ ధరించడం వల్ల కలిగే ప్రయోజనాలు, ప్రమాదాల సమయంలో హెల్మెట్ ప్రాణాలను ఎలా కాపాడుతుందో సిబ్బందికి వివరించారు.ఈ సందర్భంగా టోల్ ప్లాజా సిబ్బందికి హెల్మెట్లను పంపిణీ చేసి, ప్రతి ప్రయాణంలో తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. హెల్మెట్ ధరించడం చట్టబద్ధమైన బాధ్యత మాత్రమే కాకుండా కుటుంబ సభ్యుల పట్ల బాధ్యత అని పోలీసులు తెలిపారు.అదేవిధంగా అతివేగం, నిర్లక్ష్య డ్రైవింగ్, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ వాహనం నడపడం, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించడం వంటి ప్రమాదకర చర్యలకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రజల ప్రాణాల రక్షణే ప్రధాన లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు రోడ్డు భద్రతపై నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *