ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు, ప్రజలకు సత్వర సేవలు అందించాలనే లక్ష్యంతో మార్కాపురం జిల్లా పీసీ పల్లి పోలీస్ స్టేషన్ పోలీసులు పోగొట్టుకున్న ఒక మొబైల్ ఫోన్‌ను గుర్తించి బాధితుడికి అందజేశారు.మొబైల్ ఫోన్ పోయినట్లు బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి మొబైల్ ఫోన్ ఆచూకీని గుర్తించారు. అనంతరం మొబైల్‌ను స్వాధీనం చేసుకుని సంబంధిత బాధితుడికి అప్పగించారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ, మొబైల్ ఫోన్ లేదా ఇతర విలువైన వస్తువులు పోగొట్టుకున్న వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. ప్రజల ఆస్తుల రక్షణ, పోగొట్టుకున్న వస్తువుల రికవరీ విషయంలో మార్కాపురం జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా పనిచేస్తున్నారని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *