తొలి శుభోదయం న్యూస్ మార్కాపురం:-
మార్కాపురం పట్టణంలోని చౌక దుకాణం నెం.6లో భారీ స్థాయిలో రేషన్ బియ్యం అక్రమంగా తరలించేందుకు సిద్ధం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయ సమాచారం మేరకు రెవిన్యూ అధికారులు దుకాణాన్ని ఆకస్మికంగా తనిఖీ చేయగా, మొత్తం 1922 కేజీల బియ్యం అక్రమ రవాణాకు సిద్ధంగా ఉంచినట్లు గుర్తించారు.
అధికారుల విచారణలో ఆరోపణలు నిజమని తేలడంతో వెంటనే సంబంధిత దుకాణంపై 6A కేసు నమోదు చేసి, స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని సీజ్ చేశారు. అలాగే చౌక దుకాణాన్ని కూడా అధికారులు సీజ్ చేసినట్లు తెలిపారు.
ఈ తనిఖీల్లో ఎన్ఫోర్స్మెంట్ డిప్యూటీ తహసీల్దార్ సాలమ్మ, గ్రామ రెవిన్యూ అధికారులు పాల్గొన్నారు. ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశమై, ప్రజా పంపిణీ వ్యవస్థలో అక్రమాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు కొనసాగుతాయని అధికారులు హెచ్చరించారు.