పెండింగ్‌లో ఉన్న UI (Under Investigation/Undetected) కేసుల పరిష్కారాన్ని వేగవంతం చేసి నేర నియంత్రణను మరింత సమర్థవంతంగా అమలు చేయాలనే లక్ష్యంతో పోలీస్ అధికారులు పలు పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు.కందుకూరు డీఎస్పీ గారు, కందుకూరు సర్కిల్ సీఐ గారు కందుకూరు రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా సందర్శించి, పెండింగ్ యూఐ కేసుల పురోగతి, దర్యాప్తు విధానం, కేసుల ఛేదనకు తీసుకుంటున్న చర్యలను సమీక్షించారు. కేసుల దర్యాప్తును వేగవంతం చేసి, సాంకేతిక ఆధారాలను వినియోగించి త్వరితగతిన కేసులను పరిష్కరించాలని అధికారులకు సూచించారు.అదేవిధంగా దర్శి డీఎస్పీ గారు దర్శి పోలీస్ స్టేషన్‌ను సందర్శించి, పెండింగ్ కేసులు, యూఐ కేసుల స్థితిగతులను పరిశీలించి, నేరాల ఛేదనలో మరింత చురుకుదనం ప్రదర్శించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా కేసుల దర్యాప్తులో నాణ్యతను పెంపొందించడం, నిందితుల గుర్తింపు, సాంకేతిక పరిజ్ఞానం వినియోగం, బాధితులకు త్వరితగతిన న్యాయం అందించడం వంటి అంశాలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ప్రజలలో పోలీసు శాఖపై విశ్వాసం పెంపొందించే విధంగా ప్రతి ఫిర్యాదును ప్రాధాన్యతతో తీసుకుని పనిచేయాలని సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *