తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
అనారోగ్య కారణాలతో నెల్లూరులోని కిమ్స్ (KIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న లింగసముద్రం గ్రామ టీడీపీ అధ్యక్షులు గాలంకి ప్రసాద్ గారిని కలిసి, వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నాను. ప్రసాద్ గారికి మెరుగైన వైద్యం అందించాలని అక్కడి వైద్యులతో మాట్లాడాను. వారు త్వరగా కోలుకొని పూర్తి ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షిస్తున్నాను.అనంతరం, ఇటీవల ట్రాక్టర్ ప్రమాదంలో గాయపడి, ప్రస్తుతం ఇంటి వద్ద విశ్రాంతి తీసుకుంటున్న అన్నెబోయినపల్లి గ్రామ టీడీపీ నాయకులు ఎందేటి వెంకటేశ్వర్లు ని పరామర్శించాను. వారికి ధైర్యం చెప్పి, ఆరోగ్య విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించాను.పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తకు, నాయకుడికి నేను ఎల్లప్పుడూ అండగా ఉంటాను. మీరందరూ త్వరగా కోలుకోవాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.