దర్శి నియోజకవర్గం దొనకొండలో టిడిపి ఇంచార్జ్ డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి, యువ నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్ ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ పెన్షన్లు అందజేశారు.ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం వరుసగా 23 నెలలుగా ప్రతి నెలా సమయానికి పెన్షన్లు అందజేస్తోందని తెలిపారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమపాళ్లలో అమలు చేస్తూ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.మంచి చేసే ప్రభుత్వాన్ని ప్రజలు ఆదరించి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించాలని పిలుపునిచ్చారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *