తొలి శుభోదయం న్యూస్ ముండ్లమూరివారిపాలెం,:-

పొన్నలూరు మండలం ముండ్లమూరి వారి పాలెం గ్రామంలో వేంచేసియున్న శ్రీ కోదండ రామాలయంలో శ్రీ కోదండ రాముని పాంచాహ్నిక బ్రహ్మోత్సవాలు గురువారం రాత్రి ధ్వజారోహణతో ప్రారంభమయ్యాయి. ఆలయ అర్చకులు, టీటీడీ వేద పండితులు సీతారామాచార్యులు, టిడిపి వేద పండితులు అవినాష్ స్వామి ల ఆధ్వర్యంలో వేదమంత్రాలు నడుమ ధ్వజారోహణం జరిగింది. ఉభయ దాతలుగా ఇప్పగుంట కాంతారావు కుటుంబ సభ్యులు వ్యవహరించారు. శుక్రవారం నల్లూరి వారి మేటి ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయ ప్రాంగణం రామనామ స్మరణతో మార్మోగింది. విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వినియోగం జరిగింది. సాయంత్రం గ్రామస్తులకు అన్న ప్రసాద వినియోగం జరిగింది. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *