దొనకొండ ఎంపీడీవో కార్యాలయంలో నిర్వహించిన ప్రజా దర్బార్‌లో ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించి సంబంధిత అధికారులతో సమీక్షించాం. రెవెన్యూ, విద్యుత్, తాగునీరు, రహదారులు తదితర సమస్యలపై మొత్తం 50 వినతులు అందాయి.గత ప్రజా దర్బార్‌లో అందిన అర్జీల్లో 80 శాతం సమస్యలు పరిష్కారమవడం సంతోషకరమని, ఈసారి వచ్చిన సమస్యలను కూడా త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించాను.ప్రజలను కార్యాలయాల చుట్టూ తిప్పకుండా సమస్యలకు సత్వర పరిష్కారం చూపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, త్వరలో కొత్త పెన్షన్ల మంజూరు కూడా ప్రారంభమవుతుందని ఈ సందర్భంగా తెలియజేశాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *