తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలోని వాసవీనగర్ కాలనీ కమిటీ ఎన్నికలు ఇటీవల జరిగాయి. వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కొత్తూరు వెంకట సుధాకర్…. వాసవి నగర్ కమిటీ ప్రెసిడెంటుగా ఎన్నికల్లో విజయం సాధించారు. ఈ సందర్భంగా సుధాకర్ సహా పలువురు ఆర్యవైశ్య నేతలు…. స్థానిక శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారిని గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఎమ్మెల్యే గారిని సత్కరించారు. నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు, వాసవీ నగర్ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. విభేదాలను పక్కనపెట్టి, అందరినీ కలుపుకొని అభివృద్ధి పనులు చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వాసవీ నగర్ కమిటీ సెక్రటరీ కొత్త శ్రీనివాసులు, ట్రెజరర్ గోనుగుంట సత్యనారాయణ, ఆర్యవైశ్య నేతలు మద్దాలి సింగయ్య, కొత్తూరి శ్రీనివాసులు, చీదెళ్ల సోమశేఖర్, నూకల సుబ్బారావు, వలేటి వెంకటేశ్వరరావు, కాళహస్తి మణి, కొత్త మాధవ, కొణిజేటి ప్రసాదు తదితరులు పాల్గొన్నారు.