google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

కందుకూరు పట్టణం చుట్టుగుంట రోడ్డులోని షాదీఖానాకు నూతన కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఆరుగురు సభ్యులతో కూడిన కమిటీ పదవీకాలం 3 సంవత్సరాలు ఉంటుంది. కమిటీ ప్రెసిడెంట్ గా షేక్ సలాం (పట్టణ టిడిపి ప్రధాన కార్యదర్శి), వైస్ ప్రెసిడెంట్ గా షేక్ మహబూబ్ బాషా (షేక్ రూబీ, నెల్లూరు పార్లమెంట్ టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి), కోశాధికారిగా షేక్ మహబూబ్ బాషా (మున్నా, నియోజకవర్గ ఐటీడీపీ అధ్యక్షుడు), జాయింట్ సెక్రటరీగా సయ్యద్ సాబిహా, సభ్యురాలిగా పఠాన్ తహరున్నీసాను నియమించారు. ఈ నేపథ్యంలో కమిటీ సభ్యులు గురువారం కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు గారిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. తమను కమిటీలో సభ్యులుగా నియమించినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, ఎమ్మెల్యే గారిని సత్కరించారు. ముస్లింల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాలను ఎమ్మెల్యే గారు వారికి వివరిస్తూ… షాదీఖానా అభివృద్ధి, నిర్వహణ బాధ్యతను చక్కగా నిర్వర్తించాలని వారికి సూచించారు. ముస్లిం నేతలు షేక్ ఫిరోజ్, కుద్దూస్, ఖాదర్, ముతహర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed