తొలి శుభోదయం న్యూస్ కనిగిరి:-
మార్కాపురం జిల్లా, కనిగిరిలో RDO ఆఫీసు వద్ద… పోగాకు రైతులకు మద్దతుగా “పోగాకు రైతు దీక్ష” కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, దర్శి శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి , పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ బూచేపల్లి వెంకాయమ్మ, యర్రగొండపాలెం శాసనసభ్యులు తాటిపత్రి చంద్రశేఖర్, మాజీ మంత్రివర్యులు మేరుగ నాగార్జున, మాజీ మంత్రివర్యులు, కొండేపి నియోజకవర్గ ఇంచార్జ్ ఆదిమూలపు సురేష్ , మాజీ శాసనసభ్యులు కుందూరు నాగార్జునరెడ్డి, కనిగిరి ఇంచార్జ్ శ్రీ దద్దాల నారాయణ యాదవ్ , ఒంగోలు ఇంచార్జ్ చుండూరు రవి ,రాష్ట్ర కార్యదర్సులు… కె. వి. రమణా రెడ్డి , కె. ఆదెన్న , వెంకటేశ్వరరావు , మాజీ PDCC బ్యాంక్ చైర్మన్ శ్రీ బన్ని గారు పాల్గొన్నారు.కొండపి నియోజకవర్గం మాజీ సమన్వయకర్త డాక్టర్ మాదాసి వెంకయ్య పొగాకు రైతులకు అండగా నిలబడి దీక్షలో పాల్గొని… కూటమి ప్రభుత్వం రైతుల పట్ల చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిలదీసి… పొగాకు రైతుకు గిట్టుబాటు ధర కల్పించాలని… లేనిపక్షంలో వై.యస్.ఆర్ కాంగ్రెస్ పార్టీ రైతుల పక్షాన ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కూటమి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.ఈ దీక్ష కార్యక్రమంలో రైతులు, ప్రజలు, వై.యస్.ఆర్. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు వేలాదిగా పాల్గొని విజయవంతం చేశారు.