తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
మండలంలోని పాతసింగరాయకొండ గ్రామంలో వేంచేసియున్న శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం నందు ఆదివారం సన్నెబోయిన శ్రీనివాసులు చైర్మన్, కార్యనిర్వహణాధికారి కృష్ణవేణి ఆధ్వర్యంలో గిరిప్రదక్షిణ మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు .ఈ సందర్భంగా వారు తొలిత గ్రామంలోని దేవాలయం ఎదురు ఉన్న మండపం వద్ద కొబ్బరికాయలు కొట్టి గిరిప్రదక్షిణ మహోత్సవాన్ని వేద పండితులు నడుమ స్వామివారి నామ సంకీర్తణలతో భక్తిగీతాలు, భజనలు, భరతనాట్యం చేస్తూ పాతసింగరాయకొండ గ్రామం నరసింహస్వామి నామముతో మారుమ్రోగింది. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీహరి, పాండురంగారావు, మాగుంట శివకుమార్ రెడ్డి, టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు మించల బ్రహ్మయ్య, గాలి హరిబాబు, నక్కా బ్రాహేశ్వరరావు, కొత్తూరు రంగనాయకులు, ముఖ్య అర్చక ఉదయగిరి వెంకటశేష లక్ష్మినరసింహచార్యులు, ఉదయగిరి లక్ష్మీనరసింహ చార్యులు, విక్కిరాల నరసింహచార్యులు, ఉదయగిరి సుదర్శనాచార్యులు, రికార్డు అసిస్టెంట్ బాపట్ల బ్రహ్మయ్య, మండల తెలుగుదేశం నాయకులు, భక్తులు, గ్రామస్తులు తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.