తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
కందుకూరు పట్టణంలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన ప్రకాశం జిల్లా ఐవీఎఫ్ (IVF) నూతన కమిటీ ప్రమాణ స్వీకార మహోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొనడం జరిగింది. ఈ సందర్భంగా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కమిటీ సభ్యులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశాను.కందుకూరు నియోజకవర్గంలో నా విజయానికి ఆర్యవైశ్య సోదరులు అందించిన మద్దతు, చూపిన చొరవ ఎప్పటికీ మరువలేనిది. గత ప్రభుత్వ హయాంలో ‘జే ట్యాక్స్’ పేరుతో వ్యాపార వర్గాలను వేధించి, భయభ్రాంతులకు గురిచేసిన సంగతి మనందరికీ తెలిసిందే. కానీ, నేడు మన కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యాపారులకు పూర్తి అనుకూల, సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాం.అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి, వర్ధంతి వేడుకలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తూ, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మంత్రి శ్రీ నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో 56 అడుగుల కాంస్య విగ్రహంతో ‘స్మృతి వనం’ ఏర్పాటు చేయడం ఆర్యవైశ్యుల పట్ల మన ప్రభుత్వ గౌరవానికి నిదర్శనం.పార్టీ కోసం ఎన్నో ఇబ్బందులు, అక్రమ కేసులను ఎదుర్కొని నిలబడిన ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ సోదరుడు దూండి రాకేష్ గారి నిబద్ధత అభినందనీయం. కందుకూరు నియోజకవర్గంలో శాంతిభద్రతల పరిరక్షణే మా ప్రథమ ప్రాధాన్యత. ఆర్యవైశ్య సమాజానికి ఏ కష్టం వచ్చినా, ఏ సమస్య ఎదురైనా నేను ఎల్లప్పుడూ ముందుండి అండగా ఉంటానని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను.ఈ కార్యక్రమంలో నాతో పాటు ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ దూండి రాకేష్ గారు, మాజీ ఎమ్మెల్యే మరియు ప్రముఖ సినీ నిర్మాత అంబికా కృష్ణ గారు, మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు గారు, మరియు ఐవీఎఫ్ ప్రతినిధులు పాల్గొన్నారు.