google.com, pub-5871740414863679, DIRECT, f08c47fec0942fa0

మాదక ద్రవ్యాల నిర్మూలన, శాంతి భద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణ మరియు అసాంఘిక కార్యకలాపాల కట్టడే లక్ష్యంగా ప్రకాశం జిల్లా ఎస్పీ శ్రీ వి. హర్షవర్ధన్ రాజు, ఐపీఎస్ , ఆదేశాల మేరకు కొండేపి సిఐ వెంకయ్య రమణయ్య, కొండేపి ఎస్సై త్యాగరాజు, పొన్నలూరు ఎస్సై సత్యనారాయణ,మర్రిపూడి ఎస్సై రమేష్ మరియు పోలీస్ సిబ్బంది కొండేపి పోలీస్ స్టేషన్ పరిధిలోని దసిరెడ్డిపాలెంలో పరిసర ప్రాంతాల్లో శనివారం ఉదయం ‘ఆపరేషన్ వజ్రా ప్రహార్’లో భాగంగా కార్డన్ & సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. తనిఖీలలో భాగంగా గంజాయి మరియు ఇతర మాదక ద్రవ్యాల నిల్వ, విక్రయాలపై ప్రత్యేక దృష్టి సారిస్తూ ఇళ్లు, దుకాణాలు, పాత ముద్దాయిల నివాసాల్లో సోదాలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 30 ద్విచక్ర వాహనలను స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కు తరలించారు.ఈ సందర్భంగా కొండేపి సీఐ , మాట్లాడుతూ ప్రజలు గంజాయి, ఇతర మాదకద్రవ్యాలకు దూరంగా ఉండాలని సూచించారు. మాదకద్రవ్యాల బానిసత్వం ఆర్థిక, కుటుంబ పరమైన సమస్యలకు దారితీస్తుందని, మత్తు పదార్థాల విక్రయం, వినియోగంపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇటీవల కాలంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో, ముఖ్యంగా హెల్మెట్ ధరించకపోవడం ప్రధాన కారణమని తెలిపారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని సూచించారు. సైబర్ నేరాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అపరిచిత వ్యక్తులు ఫోన్ ద్వారా ఓటీపీలు చెప్పమని మోసపూరితంగా డబ్బులు దోచుకునే ప్రయత్నాలు చేస్తున్నారని, అలాంటి కాల్స్‌ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు.ఆధార్ కార్డులను అపరిచితులకు ఇవ్వకుండా జాగ్రత్త వహించాలని తెలిపారు. ఆధార్ వివరాలను దుర్వినియోగం చేసి సిమ్ కార్డులు తీసుకుని నేరాలకు పాల్పడే అవకాశముందని తెలిపారు. ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని సిఐ , హెచ్చరించారు. గంజాయి వంటి మాదకద్రవ్యాలు సమాచారం ఉంటే వెంటనే స్థానిక పోలీసులు లేదా డైల్112 లేదా పోలీస్ వాట్స్అప్ నెంబర్ 9121102266 తెలియజేయాలని ప్రజలను కోరారు…..

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *