ప్రయాణికులకు మెరుగైన సేవలను అందించాలని ఆర్టీసీ ఈడి జగదీష్ అన్నారు. స్థానిక బస్ స్టేషన్ ను బుధ వారం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బస్ స్టేషన్ కు ఆర్ ఓ ప్లాంట్ మంజూరు అయిందని చెప్పారు. స్టాల్స్, క్యాంటీన్, మురుగు దొడ్డిలను ఆయన పరిశీలించారు. బస్టాండ్ పరిసర ప్రాంతాలను ఆయన సందర్శించి పలు సూచనలను సలహాలను తెలియజేశారు. ఈడి జగదీష్ కు పూల బోకేని అందజేసి స్వాగతమును ఆర్ఎం లక్ష్మీనారాయణ, డిఎం రాపూరి శ్రీనివాసులు, సీఐ ప్రసాదు, తదితరులు పలికారు. అనంతరం ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *