తొలి శుభోదయం న్యూస్ దర్శి నియోజకవర్గం:-
ఒంగోలు మినీ స్టేడియంలో నిర్వహించిన ఒంగోలు మున్సిపాలిటీ 150 సంవత్సరాల వేడుకల్లో పాల్గొనడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉంది.ఘనమైన చరిత్ర, గొప్ప సాంస్కృతిక వారసత్వానికి ప్రతీకగా ఒంగోలు తెలుగు రాష్ట్రాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ఎందరో పోరాట వీరులు, కవులు, చరిత్రకారులను అందించిన ఈ గడ్డ చరిత్రలో చెరగని ముద్ర వేసుకుంది.వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో ఒంగోలుకు ప్రత్యేక స్థానం దక్కడం మనందరికీ గర్వకారణం.
150 ఏళ్ల ఘన చరిత్రకు మరింత ఘనమైన భవిష్యత్తును నిర్మిస్తూ, ఆధునిక మౌలిక వసతులు, మెరుగైన ప్రజా సౌకర్యాలు, వేగవంతమైన అభివృద్ధితో ఒంగోలును మరింత అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది.ఈ వేడుకల్లో గౌరవ ఒడిశా గవర్నర్ శ్రీ కంభంపాటి హరిబాబు గారు, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారు, మంత్రులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.