తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం:-
ప్రజల ఆరోగ్యం, పరిశుభ్రత కోసం నిత్యం శ్రమిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు సమాజంలో ఎంతో గౌరవం ఉంది. వారు ఒక్కరోజు విధులకు హాజరుకాకపోయినా పట్టణంలో పారిశుద్ధ్య పరిస్థితి ఎలా ఉంటుందో మనందరికీ తెలుసు. తమ ఆరోగ్యాన్ని సైతం లెక్కచేయకుండా ప్రజల కోసం సేవలందిస్తున్న ప్రతి పారిశుద్ధ్య కార్మికుడికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. బుధవారం నిర్వహించిన హెల్త్ క్యాంప్‌లో కార్మికులకు జనరల్ చెకప్‌తో పాటు బీపీ, షుగర్ వంటి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఇకపై కూడా క్రమం తప్పకుండా ఇటువంటి ఆరోగ్య శిబిరాలు నిర్వహించి వారి ఆరోగ్యాన్ని పర్యవేక్షించాలని అధికారులను కోరుతున్నాను.అర్హత ఉన్న కార్మికులకు ఆయుష్మాన్ భారత్ హెల్త్ కార్డులు అందించడంతో పాటు 119 సేఫ్టీ కిట్లను పంపిణీ చేశాను. విధులు నిర్వహించే సమయంలో హెల్మెట్, మాస్క్, ఏప్రాన్, షూస్, గ్లౌవ్స్ వంటి భద్రతా పరికరాలను తప్పనిసరిగా ఉపయోగించాలి.మున్సిపల్ కార్మికుల సంక్షేమం, ఆరోగ్యం, భద్రతకు ప్రాధాన్యతనిస్తూ కార్యక్రమాలు చేపడుతున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు.ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన మున్సిపల్ అధికారులు, కమిషనర్, చైర్‌పర్సన్, కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు, సిబ్బంది అందరికీ నా ధన్యవాదాలు.