ప్రకాశం జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ప్రయాణికుల భద్రత, నేరాల నియంత్రణ మరియు శాంతిభద్రతల పరిరక్షణలో భాగంగా జిల్లాలోని బస్ స్టాండ్లు, రైల్వే స్టేషన్లలో ప్రకాశం జిల్లా పోలీసులు విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు.తనిఖీల్లో భాగంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాలు, ప్లాట్‌ఫారాలు, ప్రవేశ–నిష్క్రమణ మార్గాలు, పార్కింగ్ ప్రాంతాల్లో పోలీసు సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాల కదలికలను పరిశీలిస్తూ ముందస్తు జాగ్రత్త చర్యలు చేపడుతున్నారు.ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని, గుర్తుతెలియని వ్యక్తుల నుంచి వస్తువులు స్వీకరించవద్దని, అనుమానాస్పద కార్యకలాపాలు కనిపిస్తే వెంటనే సమీప పోలీసులకు సమాచారం అందించాలని పోలీసులు సూచించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *