తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేస్తూ, ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని ప్రజలకు సేవలందించాలని జిల్లా ఎస్పీ గారు, శిక్షణ పూర్తి చేసుకుని తమ సొంత జిల్లాల్లో కొత్తగా విధుల్లో చేరనున్న కానిస్టేబుళ్లకు బుధవారం కొత్తమామిడిపాలెం వద్ద ఉన్న పోలీస్ ట్రైనింగ్ సెంటర్లో దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాకు చెందిన 190 మంది స్టైపెండరీ పోలీస్ కానిస్టేబుళ్లు తొమ్మిది నెలల పాటు పోలీస్ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకుని, తమ సొంత జిల్లాల్లో విధులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు.ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ పోలీసు శాఖలో పని చేయడం అనేది ప్రజలకు అత్యంత చేరువగా ఉంటూ సేవ చేసే గొప్ప అవకాశం అని, పోలీసు ఉద్యోగం మిగిలిన ఇతర ప్రభుత్వ ఉద్యోగాలతో పోలిస్తే ఎంతో భిన్నమైనదని, ఎన్నో సవాళ్ళతో కూడుకున్నదని, మానసికంగా, శారీరకంగా దృఢంగా ఉండాలని సూచించారు. శిక్షణలో భాగంగా ఇండోర్, ఔట్డోర్ శిక్షణతో పాటు చట్టాలు, క్రిమినల్ లా, లా అండ్ ఆర్డర్, ఫిజికల్ ఫిట్నెస్, పరేడ్ డ్రిల్, ఆయుధాల వినియోగం, ట్రాఫిక్ నియంత్రణ, CCTNS, సైబర్ క్రైమ్, ఫోరెన్సిక్ సైన్స్, డిజిటల్ ఎవిడెన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ వంటి ఆధునిక పోలీసింగ్ అంశాలపై కూడా శిక్షణ అందించిన దానిపై మీ జిల్లాలో సమర్ధవంతంగా విధులు నిర్వహించాలన్నారు.విధి నిర్వహణను బాధ్యతగా, అంకితభావంతో చేస్తూ, తాము ఎంచుకున్న విధులను ఇష్టపడి పనిచేస్తూ ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. విధుల్లో భాగంగా శారీరక, మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. రహదారులపై ప్రయాణించే సమయంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించి, ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని సూచించారు. వారు విధులు నిర్వహించే జిల్లాకు, పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావడానికి కృషి చేయాలని, మనందరిదీ ఒకే యూనిఫాం, ఒకే బాధ్యత అనే భావనతో విధులు నిర్వహించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ తమ విద్యార్హతలకు అనుగుణంగా జ్ఞానం, నైపుణ్యాలను పెంపొందించుకుంటూ అంకితభావంతో విధులు నిర్వహించాలని, భవిష్యత్తులో ఉన్నత ఉద్యోగాలు సాధించే దిశగా కృషి చేయాలని ఆకాంక్షించారు. ఇటీవల నిర్వహించిన పాసింగ్ అవుట్ పరేడ్లో అద్భుతమైన ప్రతిభ కనబరిచినందుకు కానిస్టేబుళ్లను జిల్లా ఎస్పీ గారు అభినందించారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) యన్.యుగంధర్ బాబు, డిటిసి సీఐ పాండురంగారావు, ఆర్ఐ రవికుమార్, ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.