గతంలో అమలు చేసిన 14 సంక్షేమ పథకాలు అమలు చేయాలి భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులకు 10 లక్షల రూపాయల పరిహారంతో కూడిన ప్రమాద బీమాను అమలు చేసి భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలని ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మికుల సంఘం( ఐ ఎఫ్ టి యు అనుబంధం )రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ ఆర్ మోహన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మికులకు ప్రమాద బీమా అమలు చేయాలని 14 సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అక్టోబర్ 5వ తేదీ ఒంగోలు కలెక్టరేట్ జరిగే ధర్నాని జయప్రదం చేయాలని కార్మిక వర్గానికి పిలుపునిచ్చారు. శనివారం సింగరాయకొండ మండల కేంద్రంలో శాంతి హాలు ఎదురుగా గల భవన కార్మికుల అడ్డాపై ప్రచార క్యాంపెయిన్ నిర్వహించారు. ఈ సందర్భంగా కామ్రేడ్ ఆర్ మోహన్ మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు పునరుద్ధరిస్తామని,సంక్షేమ పథకాల అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను మర్చిపోయిందని, కార్మికులు గత రెండు సంవత్సరాలుగా పోరాడిన ఫలితంగా మూడు సంక్షేమ పథకాలు మాత్రమే అమలు చేశారని, ప్రధానమైన భవనిర్మాణ కార్మికులకు ప్రమాదభిమాను, హాస్పిటలైజేషన్భిమాను అమలు చేయలేదని విమర్శించారు.గత 12 సంవత్సరాల్లో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు కు 5,000 కోట్ల రూపాయలు సె స్ రూపంలో జమ అయ్యాయి. వాటిలో 1,500 కోట్ల కోట్ల రూపాయలు మాత్రమే కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేసినట్లుచూపించారని. నిజానికివాటిలో కూడా 932 కోట్ల రూపాయలు తల్లికి వందనం పథకానికి తరలించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్మికుల సంక్షేమాన్ని మరచి, పెట్టుబడుదారుల సంక్షేమం కోసం కూటమి ప్రభుత్వం శ్రద్ధ చూపిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు, ఇంకా ఈ కార్యక్రమంలో అఖిల భారత రైతుకుల సంఘం జిల్లా అధ్యక్షుడు కామ్రేడ్ కే నాంచార్లు, ఐయఫ్ టి యు జిల్లా కార్యదర్శి టి వెంకట్రావు, మండల నాయకులు పి నరసింహం, కే రాము ఎస్కే బాబులు తదితరులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *