ఉలవపాడు మండలంలోని ఉలవపాడు లోని ప్రభుత్య జూనియర్ కళాశాల నందు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మరియు ప్రకాశం జిల్లా దిశ వారి ఆదేశాల మేరకు, కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ గారు శ్రీ జి , గోపీచంద్ ప్రకాష్ గారి సహకారంతో లింక్ వర్కర్ స్కీమ్ వారి ఆధ్వర్యంలో హెచ్ ఐ వి ఎయిడ్స్, క్షయ వ్యాధి మరియు సుఖ వ్యాధులు పై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ గారు మాట్లాడుచు హెచ్ ఐ వి/ఎయిడ్స్ పై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలని ఎవ్వరకూడ ఈ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని, మంచిగా విద్యను అభ్యసించి ఉన్నత స్థాయిలో ఉండాలని తెలియజేసినారు స్థానిక లింక్ వర్కర్ వీరమల్లు రవీంద్ర మాట్లాడుచు హెచ్ ఐ వి అంటూ వ్యాధి కాదు అని అంటినుకొను వ్యాధి అని హెచ్ ఐ వి వైరస్ ఒకరి నుండి మరొకరికి నాలుగు మార్గాలు ద్వారా వ్యాప్తి చెందుతుందని అని హెచ్ ఐ వి వైరస్ మానవ శరీరంలోని వ్యాధి నిరోధక శక్తిని క్షీణింప చేస్తుందని, దీనివలన ఆ వ్యక్తి కి అనేక వ్యాధులు సంక్రమించి ఎయిడ్స్ దశకు చేరుతుందని దీనివలన ప్రాణాంతకంగా మారుతుందని, ఎయిడ్స్ తో జీవిస్తున్న వారికి ప్రభుత్వం వారు ప్రతి నెలా ఉచితంగా ఏ ర్ టి మందులు పంపిణీ చేస్తున్నారు అని ఏ ర్ టి మందులు వాడిన ఎడల జీవిత కాలం పెరుగుతుందని , ప్రతి ప్రభుత్వ హాస్పిటల్ లోని ఐ సి టి సి సెంటర్స్ లో హెచ్ ఐ వి పరీక్షలు ఉచితంగా అందుబాటులో ఉన్నాయని తెలియజేయడం జరిగినది అలాగే క్షయ వ్యాధి అంటువ్యాధి అని సుఖ వ్యాధులు కూడ అంటువ్యాధులు అని కనుక పై వ్యాధుల పట్ల పూర్తిగా అవగాహన కలిగి ఉండాలని ఎవ్వరకూడ కూడా ఈ వ్యాధుల బారిన పడకుండా జాగ్రత్తగా ఉండాలని తెలియజేసినారు ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ప్రిన్సిపల్ , సూపర్వైజర్ శ్రీ వట్టేం అనిల్ కుమార్ , లింక్ వర్కర్ పందిటి.మహేశ్ కళాశాల అధ్యాపకులు శ్రీ చల్లా శ్రీనివాసులు , మాధవ రెడ్డి, న్యూడల్ ఆఫీసర్ శ్రీ అగ్గి గంగా భవాని మరియు కళాశాల సిబ్బంది విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *