భీమవరం గ్రామంలో బెల్ట్‌ షాపుల ద్వారా జరుగుతున్న అనధికారిక మద్యం విక్రయాలు, ఆటోల ద్వారా బహిరంగంగా మద్యం సరఫరా చేయడంపై వైఎస్సార్‌సీపీ నాయకులు మరియు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.మద్యం సులభంగా అందుబాటులో ఉండటం వల్ల మద్యం మైనర్లకు చేరుతోంది. ముఖ్యంగా రోజువారీ కూలీలు, ఆర్థికంగా బలహీన వర్గాల ప్రజలు మద్యానికి అలవాటు పడటం వల్ల వారి ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు, కుటుంబాల ఆర్థిక పరిస్థితిపై కూడా ప్రతికూల ప్రభావం పడుతోందని పేర్కొన్నారు. నివాస ప్రాంతాల్లో మద్యం విక్రయాలు, సేవనం వల్ల మహిళలు, చిన్నారుల భద్రతపై కూడా ఆందోళన నెలకొంటోందని తెలిపారు.ఈ సమస్యపై అధికారులకు వినతి పత్రం సమర్పించి, అనధికారిక మద్యం విక్రయాలు, ఆటోల ద్వారా మద్యం సరఫరా, అధిక ధరలకు విక్రయాలు మరియు మైనర్లకు మద్యం చేరకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ IT వింగ్ అధ్యక్షులు అమర్‌నాథ్ రెడ్డి, ఉలవపాడు మండల బూత్ అధ్యక్షులు సురేంద్ర రెడ్డి, మండల ప్రచార విభాగం కార్యదర్శి ఆలూరి మోషే, సోషల్ మీడియా అధ్యక్షులు ఆలూరి మధు మరియు గ్రామస్తులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *