తొలి శుభోదయం న్యూస్ కందుకూరు:-
ప్రజల సౌకర్యార్థం ప్రధానమంత్రి సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన (PM Surya Ghar: Muft Bijli Yojana) పథకం ద్వారా గృహాలపై సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకునేందుకు సేవా సేతు అభియాన్ కార్యక్రమాన్ని ఆపరేషన్ సబ్ డివిజన్, కందుకూరు టౌన్ ఆధ్వర్యంలో నిర్వహించనున్నాము.ఈ కార్యక్రమం అక్టోబర్ 6, 7 మరియు 8 తేదీలలో కందుకూరు టౌన్ సబ్ డివిజన్ పరిధిలోని కందుకూరు టౌన్, కందుకూరు రూరల్స్, పొన్నలూరు సెక్షన్లల వినియోగదారులు కోసం నిర్వహించబడుతుంది. ఈ సేవా సేతు అభియాన్‌లో ప్రజలకు పథకానికి సంబంధించిన సేవలను ఒకే చోట అందించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేయబడుతున్నాయి. ముఖ్యంగా:- PM Surya Ghar పథకంలో ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు కోసం అధీకృత Vendor ఎంపిక బ్యాంకు రుణం (Bank Loan) పొందేందుకు అవసరమైన ప్రక్రియ పథకానికి సంబంధించిన ఇతర అవసరమైన ఆన్‌లైన్ మరియు దరఖాస్తు ప్రక్రియలు వంటి సేవలను క్యాంపు వద్దనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయబడుతున్నాయి.కావున కందుకూరు టౌన్ టౌన్, కందుకూరు రూరల్, పొన్నలూరు సెక్షన్ల పరిధిలోని గృహ విద్యుత్ వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని, తమ ఇళ్లపై సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేసుకోవడానికి అక్టోబర్ 6, 7 మరియు 8 తేదీలలో నిర్వహించే సేవా సేతు అభియాన్ క్యాంపు గవర్నమెంట్ హాస్పిటల్ వెనుక ఉన్న కందుకూరు టౌన్ సెక్షన్ ఆఫీస్ సందర్శించాలని కోరుతున్నాము.ప్రాంతం: కందుకూరు టౌన్ సెక్షన్ ఆఫీస్ గవర్నమెంట్ హాస్పిటల్ వెనుక భాగంలో
సెక్షన్లు: కందుకూరు టౌన్, కందుకూరు రూరల్, పొన్నలూరు
తేదీలు: అక్టోబర్ 6, 7 & 8
కార్యక్రమం: సేవా సేతు అభియాన్ – PM Surya Ghar: Muft Bijli Yojana