తొలి శుభోదయం న్యూస్ కోవూరు నియోజకవర్గం :-
‘పల్లె పండుగ 3.0’ కార్యక్రమంలో భాగంగా కోవూరు నియోజకవర్గంలో సీసీ రోడ్లు, ఉపాధి హామీ పథకం,పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశాను.కోవూరు నియోజకవర్గానికి ‘పల్లె పండుగ 3.0’ కింద రూ.9.60 కోట్లతో 217 అభివృద్ధి పనులు చేపడుతున్నాం. ఇందులో భాగంగా పల్లిపాడు గ్రామంలో రూ.10 లక్షలతో సీసీ రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుట్టాం.గతంలో ‘పల్లె పండుగ 2.0’ కింద రూ.10 కోట్లతో డ్రెయిన్లు, సీసీ రోడ్లు, ఇతర మౌలిక వసతుల అభివృద్ధి పనులు పూర్తి చేశాం.గ్రామాల్లో మౌలిక వసతులను మెరుగుపరచి, ప్రజలకు మెరుగైన జీవన ప్రమాణాలు అందించడమే లక్ష్యంగా అభివృద్ధి పనులను నిరంతరం కొనసాగిస్తున్నాం.