“గ్రామాల్లో ప్రజలకు ఎక్కడ ఏ అవసరం ఉందో గుర్తించి, దశలవారీగా అభివృద్ధి పనులు చేపడుతున్నాం. పల్లె పండుగ 1.0, 2.0లో కొడవలూరు మండలానికి రూ.1.18 కోట్ల పనులు చేపట్టగా, ఇప్పుడు 3.0లో మరో రూ.2.06 కోట్ల పనులు మంజూరయ్యాయి.కోవూరు నియోజకవర్గంలో మొత్తం 217 పనులకు సుమారు రూ.10 కోట్లు కేటాయించాం. కొడవలూరులో 56 పనులు జరుగుతున్నాయి. మిగిలిన రోడ్లు, డ్రెయిన్లను కూడా గుర్తించి పూర్తి చేస్తాం.పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండదు. ‘ఇది మన ఊరు.. ఇది మన పని’ అనే బాధ్యతతో ప్రతి ఒక్కరూ పనులను పర్యవేక్షించాలి.కిసాన్ సెజ్ ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించడం, ప్రతి ఇంటికీ తాగునీరు అందించడం, చక్కెర కర్మాగారం సమస్యకు పరిష్కారం చూపడం మా ప్రధాన లక్ష్యాలు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *