విడవలూరు గ్రామపంచాయతీలో పల్లె పండుగ 3.0లో భాగంగా రూ.14.75 లక్షలతో చేపడుతున్న 5 సీసీ రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశాను. ఈ రహదారుల నిర్మాణంతో ప్రజలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయి.కోవూరు నియోజకవర్గానికి పల్లె పండుగ 3.0 కింద మంజూరైన రూ.9.60 కోట్లలో విడవలూరు మండలానికి రూ.1.62 కోట్లు కేటాయించగా, 46 అభివృద్ధి పనులు చేపడుతున్నాం. రహదారులతో పాటు రైతులకు పశువుల షెడ్లు, ఉద్యాన పంటల ప్రోత్సాహం, డ్రైన్లు, బస్ షెల్టర్లు, పంచాయతీ భవనాలు వంటి అనేక మౌలిక వసతుల పనులు కూడా జరుగుతున్నాయి.గ్రామాల సమగ్ర అభివృద్ధికి పెద్దపీట వేస్తూ, ప్రజలకు అవసరమైన మౌలిక వసతులను అందుబాటులోకి తీసుకురావడమే కూటమి ప్రభుత్వ లక్ష్యం.పల్లెల అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, యువ నాయకులు శ్రీ నారా లోకేష్ గారికి విడవలూరు ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *