తొలి శుభోదయం న్యూస్ సింగరాయకొండ :-
అక్టోబర్ రెండవ తేదీ ఒంగోలులోని డిఆర్ఆర్ఎం మున్సిపల్ హైస్కూల్లో జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఎంపికల్లో సింగరాయకొండ జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల విద్యార్థినిలు ఏడు మంది ఫుట్బాల్ గేమ్ కోసము రాష్ట్రస్థాయికి ఎంపిక అయ్యారు. వీరు తదుపరి చిత్తూరులో జరగనున్న పోటీల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా పాఠశాల జరిగిన కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయిని కే. మహాలక్ష్మి ఎంపికైన విద్యార్థినులను మరియు వారికి తర్ఫీదు ఇచ్చిన పీఈటి లు ఏ కోటేశ్వరమ్మ మరియు ఎల్ లావణ్యలను అభినందించడం జరిగింది.