ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలోని లింగసముద్రం మండలం పెదపవని గ్రామంలో సోమవారం నాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన 70 కుటుంబాలు మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరాయి. ఈ సందర్భంగా మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి కొత్తగా పార్టీలో చేరిన కుటుంబాలకు టీడీపీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ శ్రేణులను సమన్వయం చేసుకుంటూ, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయడం, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం వంటి అంశాలపై పార్టీ నాయకులు, కార్యకర్తలు దృష్టి సారించాలని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం సాధ్యమని మంత్రి అన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *