తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
ప్రజల భద్రతకు భరోసా కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, నేరాలను అరికట్టడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ప్రత్యేకంగా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్లు (CASO) నిర్వహించారు.ఈ క్రమంలో ఒంగోలు టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇందుర్తి నగర్‌లో పోలీసులు CASO ఆపరేషన్ చేపట్టారు. అదేవిధంగా ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలరాం కాలనీలో కూడా కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు.బాలరాం కాలనీలో నిర్వహించిన CASO కార్యక్రమంలో పాల్గొన్న పోలీసు సిబ్బందికి ఒంగోలు తాలూకా సీఐ గారు ముందస్తు సూచనలు, విధుల నిర్వహణపై మార్గనిర్దేశం చేశారు. అనంతరం పోలీసు సిబ్బంది సమన్వయంతో తనిఖీలు చేపట్టారు.ఈ ఆపరేషన్లలో భాగంగా అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, వాహనాలపై పోలీసులు తనిఖీలు నిర్వహించి, నేరాల నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టారు. ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడంతో పాటు, చట్టవిరుద్ధ కార్యకలాపాలను అరికట్టేందుకు పోలీసులు నిరంతరం నిఘా కొనసాగిస్తున్నారు.ప్రజల భద్రత, నేరాల నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణే లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసుల ప్రత్యేక తనిఖీలు కొనసాగుతున్నాయి.