కోవూరు నియోజకవర్గంలో నెల్లూరు పార్లమెంటు సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి గారు, ఎమ్మెల్యే శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి నాయకత్వంపై విశ్వాసంతో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలో కోవూరు మండలం పడుగుపాడుకు చెందిన 60 కుటుంబాలు సోమవారం వైసీపీని వీడి టీడీపీలో చేరాయి. నెల్లూరులోని వీపీఆర్‌ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో వీపీఆర్‌ దంపతులు కొత్తగా పార్టీలో చేరిన వారికి పసుపు కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. వ్యవసాయ మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ ఛైర్మన్‌ పెంచలయ్య ఆధ్వర్యంలో పడుగుపాడుకు చెందిన విన్నకోట వాసు, విన్నకోట శ్రీనివాసులు నాయుడు, విన్నకోట వెంకట రమణయ్య, విన్నకోట వెంకటేశ్వర్లు, విన్నకోట జగదీశ్‌, విన్నకోట రాహుల్‌, విన్నకోట భాను, బొచ్చు చంద్రమౌళి, దాసరి శశికుమార్‌ తదితరులు టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు.ఈ సందర్భంగా వీపీఆర్‌ దంపతులు మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు అందుతున్న సంక్షేమ పథకాలు, నియోజకవర్గంలో చేపడుతున్న అభివృద్ధి పనుల వివరాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. టీడీపీలో చేరిన నాయకులు మాట్లాడుతూ.. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌ రెడ్డి గారు, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి గారి నాయకత్వంపై నమ్మకంతోనే పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో వీపీఆర్‌ దంపతుల మార్గదర్శకత్వంలో పనిచేస్తూ కూటమి అభ్యర్థులకు మద్దతుగా నిలుస్తామని వెల్లడించారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *