ప్రజల భద్రతకు భరోసా కల్పించడం, శాంతిభద్రతలను పరిరక్షించడం, నేరాలను అరికట్టడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.ఈ క్రమంలో కొండపి పోలీస్ స్టేషన్ పరిధిలోని పెద్దకంద్లగుంట గ్రామంలో కొండపి సీఐ గారు స్వయంగా పోలీసు సిబ్బందితో కలిసి కార్డన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ (CASO) నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో తనిఖీలు చేపడుతూ, ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.అనంతరం గ్రామస్థులకు MCC (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ – ఎన్నికల ప్రవర్తనా నియమావళి) గురించి అవగాహన కల్పించారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించాలని, ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడకూడదని సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలకు దూరంగా ఉంటూ, ప్రశాంత వాతావరణం నెలకొనేలా పోలీసులకు సహకరించాలని గ్రామస్థులకు వివరించారు.ప్రజల్లో భద్రతా భావాన్ని పెంపొందించడం, నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవడం, చట్టంపై అవగాహన కల్పించడం లక్ష్యంగా ప్రకాశం జిల్లా పోలీసులు ఇటువంటి కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *