తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్:-
సమాజంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించే జూదం వంటి అక్రమ కార్యకలాపాలపై ప్రకాశం జిల్లా పోలీసులు కఠిన చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొండపి పోలీస్ స్టేషన్ పరిధిలోని అనకర్లపూడి గ్రామంలో జూదం నిర్వహిస్తున్న వారిపై ప్రత్యేక దాడి చేపట్టారు.కొండపి ఎస్సై గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ దాడిలో 5 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రూ.3,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. జూదం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలు కుటుంబాల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీసి, ఇతర నేరాలకు దారితీసే ప్రమాదం ఉందని పోలీసులు తెలిపారు.ఇటువంటి అక్రమ కార్యకలాపాలపై ప్రకాశం జిల్లా పోలీసులు నిరంతరం ప్రత్యేక నిఘా కొనసాగిస్తారని, ప్రజలు తమ పరిసరాల్లో జూదం, గంజాయి, బహిరంగ మద్యం సేవనం వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలపై సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని కోరారు. సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని తెలిపారు.