తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-
రోడ్డు ప్రమాదాల నివారణకు కట్టుబడి ఉన్న ప్రకాశం మరియు మార్కాపురం జిల్లా పోలీసులు ట్రాఫిక్ నిబంధనల అమలులో భాగంగా ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. ఎస్పీ ఆదేశాల మేరకు అనధికార హై బీమ్ లైట్లు, అధిక కాంతి వెలువరించే లైటింగ్ పరికరాలపై కఠిన చర్యలు తీసుకుంటున్నారు.హై బీమ్ లైట్లు ఎదురుగా వచ్చే వాహనదారుల దృష్టిని ప్రభావితం చేసి ప్రమాదాలకు దారితీస్తున్నాయని గుర్తించిన పోలీసులు, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వాహనాలపై కేసులు నమోదు చేసి, ప్రమాదకర లైటింగ్‌ను తొలగిస్తున్నారు.ఇలాంటి మార్పులు చట్టవిరుద్ధమని, ఇతరుల ప్రాణాలకు ప్రమాదం కలిగిస్తాయని హెచ్చరిస్తూ వాహనదారులు ట్రాఫిక్ నియమాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రాత్రివేళల్లో లో బీమ్ వినియోగం, హెల్మెట్ ధరించడం, ఓవర్ స్పీడ్ నివారణ, రాంగ్ రూట్ డ్రైవింగ్ చేయకపోవడం వంటి భద్రతా చర్యలు పాటించడం ద్వారా ప్రమాదాలను నివారించవచ్చని తెలిపారు.ప్రతి వాహనదారుడు బాధ్యతగా వ్యవహరించి, రోడ్డు భద్రతకు సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు.