విద్యార్థులు చదువుతోపాటు విజ్ఞానం, మంచి అలవాట్లను పెంపొందించుకోవాలని మార్కాపురం జిల్లా కలెక్టర్ ఎం విజయ సునీత సూచించారు. మార్కాపురం పట్టణంలోని జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారంకిషోరివికాసం’కార్యక్రమంలోఆమెముఖ్యఅతిథిగాపాల్గొని అధికారులతో కలిసి కార్యక్రమ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ నేటి నుంచి జూన్ 11వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని విద్యార్థులు ఈ అవకాశాన్నిసద్వినియోగంచేసుకోవాలని కోరారు. ప్రతి మంగళ, శుక్రవారాల్లోవిద్యార్థినీవిద్యార్థులకు వైద్య ఆరోగ్య, ఐ సి డి ఎస్, విద్య, సోషల్ వెల్ఫేర్, స్కిల్ డెవలప్మెంట్, మెప్మా శాఖల అధికారులు పలు విషయాలపై అవగాహన కల్పిస్తారన్నారు. ముఖ్యంగా బాల్య వివాహాలు, సైబర్ నేరాలు, డ్రగ్స్, ఇతర మత్తు పదార్థాలకుదూరంగాఎలాఉండాలి వంటి అంశాలను తెలియజేయడం జరుగుతుందన్నారు. అదేవిధంగా కమ్యూనికేషన్ స్కిల్స్, సెల్ఫీ అవేర్నెస్,పోషకాహారప్రాముఖ్యత, బ్యాంకింగ్ రంగ మెలకువలు, సెక్సువల్ ఎడ్యుకేషన్ పై పూర్తిస్థాయిలోఅవగాహనకల్పిస్తారని వివరించారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తులో ఉన్నత స్థానానికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ ఇన్చార్జి పీ డి పద్మావతి, డి ఎల్ డి ఓ బాలు నాయక్, ఇన్చార్జి డిఎంహెచ్వో రాహుల్, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి కంచిబాబు, సిఐ అల్తాఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *