బుద్ధ పూర్ణిమను పురస్కరించుకుని కందుకూరులోని బహుజన టీచర్స్ అసోసియేషన్ (BTA) కార్యాలయంలో శ్రీ షేక్ అబ్దుల్లా ఆధ్వర్యంలో బుద్ధపూర్ణిమ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి దాసరి వీరనారాయణ అధ్యక్షత వహించారు.
​ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఉపాసక శ్రీ గాండ్ల హరిప్రసాద్ మాట్లాడుతూ, తధాగత బుద్ధుడు స్థాపించిన బౌద్ధధర్మం ఈనాటి ఆధునిక సమాజానికి దిక్సూచి వంటిదని, శాంతి మరియు సహజీవనానికి బౌద్ధం ఎంతో అవసరమని పేర్కొన్నారు.ప్రపంచ వ్యాప్తంగా జరుపుకుంటున్న ఈ బుద్ధ జయంతిని జాతీయ సెలవుదినంగా ప్రకటించాలని బౌద్ధ సంఘాలన్ని డిమాండ్ చేస్తున్నాయని తెలిపారు. అనంతరం షేక్ అబ్దుల్లా మాట్లాడుతూ బుద్ధుని బోధనలు మానవాళికి ఏ విధంగా ఉపయోగపడతాయో వివరించారు.
​చలంచర్ల పెదబ్రహ్మయ్య బౌద్ధాన్ని విశ్వమానవ మతంగా కొనియాడగా, గేరా చిరంజీవి బుద్ధుడు ప్రబోధించిన పంచశీల సూత్రాల ప్రాముఖ్యతను వివరించారు. దార్ల కోటేశ్వరరావు మాట్లాడుతూ ” ప్రపంచవ్యాప్తంగా ఆదరిస్తున్న మతం బౌద్ధ మతం అని, బౌద్ధ మార్గం ద్వారా జీవనశైలి ఎంతో మెరుగుపడతాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో , మండూరి రమణయ్య, దాసరి మధు, ధన్యాసి మాల్యాద్రి, మెండా నరసింహ, కసుకుర్తి అంజయ్య, కొప్పోలు శ్రీను, గుడిపూడి వెంకటరావు, సుబ్రహ్మణ్యం, ఏపూరి మనోహర్, భగత్ సింగ్, వలేటి మాలకొండయ్య తదితరులు పాల్గొన్నారు. వీరందరూ బౌద్ధ ధర్మం యొక్క విశిష్టతను మరియు సమాజంలో దాని ఆవశ్యకతను గురించి తమ ప్రసంగాల ద్వారా తెలియజేశారు

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *