తొలి శుభోదయం న్యూస్ దొనకొండ:-

దొనకొండ మండలం, భూమనపల్లి గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నదాత సుఖీభవ – PM కిసాన్ 3వ విడత కింద దర్శి నియోజకవర్గంలోని 42,871 మంది రైతన్నలకు ₹24.40 కోట్ల చెక్కును వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి అందజేశారు దర్శి టిడిపి ఇంచార్జ్ డా. గొట్టిపాటి లక్ష్మీ , టిడిపి యువ నాయకులు డా. కడియాల లలిత్ సాగర్ .ఈ సందర్భంగా డా. లక్ష్మీ మాట్లాడుతూ, గౌరవ ముఖ్యమంత్రి N. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో రైతులకు ఆర్థిక భరోసా కల్పిస్తున్నామని తెలిపారు. సూపర్ సిక్స్ హామీ ప్రకారం ప్రతి ఏడాది రైతులకు ₹20,000 ఆర్థిక సాయం అందిస్తూ, వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చడం కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు, స్థానిక నాయకులు, టిడిపి–జనసేన–బిజెపి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *