తొలి శుభోదయం న్యూస్ ప్రకాశం పోలీస్ :-

మహిళల భద్రతను మరింత బలోపేతం చేసే దిశగా ప్రకాశం జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో “శక్తి యాప్” పై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువతులు మరియు విద్యార్థులకు శక్తి యాప్ వినియోగంపై వివరంగా తెలియజేశారు.పోలీసు అధికారులు శక్తి యాప్‌ను ఎలా డౌన్‌లోడ్ చేసుకోవాలి, ఎలా రిజిస్టర్ కావాలి, అత్యవసర పరిస్థితుల్లో యాప్‌ను ఎలా ఉపయోగించాలి అనే విషయాలను ప్రదర్శన ద్వారా వివరించారు. ఈ యాప్ ద్వారా అత్యవసర సమయంలో వెంటనే పోలీసులకు సమాచారం చేరడంతో పాటు, లొకేషన్ ట్రాకింగ్ ద్వారా త్వరితగతిన సహాయం అందించవచ్చని తెలిపారు.మహిళలు ఎటువంటి భయాందోళనలు లేకుండా సురక్షితంగా జీవించేందుకు ఈ యాప్ ఎంతో ఉపయోగపడుతుందని, ప్రతి మహిళ తప్పనిసరిగా శక్తి యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకుని వినియోగించాలని పోలీసులు సూచించారు.అలాగే ఈ యాప్ గురించి ఇతరులకు కూడా తెలియజేసి, సమాజంలో మహిళల భద్రతను మరింత బలోపేతం చేయడంలో భాగస్వాములు కావాలని కోరారు.ప్రకాశం జిల్లా పోలీసులు మహిళల రక్షణకు కట్టుబడి ఉండి, సాంకేతికతను వినియోగిస్తూ భద్రతా సేవలను మరింత సమర్థవంతంగా అందిస్తున్నారని తెలిపారు.

By JALAIAH

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *